కుర్ర హీరోలు కూడా ఒక చిత్రం పూర్తయిన తర్వాత మరో చిత్రాన్ని ప్రారంభిస్తుంటే సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం ఒకేసారి 'కబాలి', 'రోబో2.0' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ వయసులో కూడా ఆయన ఓ వైపు 'కబాలి' చిత్రానికి డబ్బింగ్ చెబుతూ, మరోవైపు 'రోబో2.0' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ వయస్సులో కూడా రజనీకాంత్ కేవలం ఐదు రోజుల్లో 'కబాలి' చిత్రం డబ్బింగ్‌ను పూర్తి చేశాడు. ఇక ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో విడుదల చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. రియలిస్టిక్ చిత్రాలను తెరకెక్కిండంలో అతి తక్కువ కాలంలోనే తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రంజిత్ పా 'కబాలి' చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజనీకాంత్ వయసు మళ్లిన గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తుండగా, ఆయనకు జోడీగా రాధికాఆప్టే నటిస్తోంది. ఈ చిత్రం ఆడియోను కూడా అతి త్వరలో తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం రజనీకి మరో 'బాషా' చిత్రం అవుతుందని యూనిట్ సభ్యులతోపాటు అభిమానులు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం పోస్టర్స్ ఇప్పటికే ఈ చిత్రంపై ఉన్న అంచనాలను భారీగా పెంచేశాయి. కలైపులిథాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.