'సూపర్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుష్క. ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ ను సాగిస్తుంది. తను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నాగార్జున గారే అని వీలున్నప్పుడల్లా.. ఆయనను పొగుడుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో ఆయన సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పింది. నాగ్ నటించే సినిమాలో చిన్న రోల్ లో తనను నటించమని అడిగినా.. మాట తప్పకుండా.. ఎంత బిజీగా ఉన్నా.. వెంటనే ఓకే చెబుతుంటుంది. రీసెంట్ గా 'సోగ్గాడే చిన్ని నాయనా','ఊపిరి' చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన అనుష్క మరోసారి నాగ్ సినిమాలో కనిపించడానికి రెడీ అయింది. నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో 'హథిరామ్ బాబా' జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో అమ్మవారి పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం.