రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో విశాల్ ఓ గమ్మత్తైన కామెంట్‌ని తన తోటి హీరో, క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆర్యపై వేశాడు. మీ వివాహం గురించి తర్వాత చెబుదురు... ముందు మీ ఫ్రెండ్ ఆర్య పెళ్లి గురించి చెప్పండి.. అని మీడియా అడగటంతో విశాల్ మాట్లాడుతూ... నేను కూడా హీరో ఆర్య పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా? అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే పెళ్లి ఆయన మంచి కోసం కాదు... ఇక్కడుండే మిగిలిన అమ్మాయిల మంచి కోసం... అని కొంటె సమాధానం ఇచ్చాడు. తమిళనాట ఆర్యను మిస్టర్ మన్మథుడు అని పిలుస్తుంటారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని లైన్ వేస్తూ, తోటి ఆర్టిస్ట్‌లను కూడా వదలడని... దాన్ని దృష్టిలో పెట్టుకొనే విశాల్ ఇలా కామెంట్ చేశాడన్నమాట...! కాగా విశాల్ నటించిన 'కథకళి' చిత్రం మంచి హిట్టయింది. కాగా ఆయన ప్రస్తుతం 'మరుదు' అనే చిత్రం చేస్తున్నాడు. అయితే విశాల్ హీరోగా సుందర్.సి. దర్శకత్వంలో జెమిని ఫిలిం సర్క్యూట్స్ సంస్థ నిర్మించిన 'మదగజరాజా' చిత్రానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇంతకాలం ఆర్థిక కారణాల వల్ల ఇబ్బందులు పడుతూ వస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు రంగం సిద్దం కావడంతో విశాల్ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.