అతను దర్శకత్వం వహించింది కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే. కానీ ఆయనకు 100 చిత్రాలను దర్శకత్వం వహించిన డైరెక్టర్ల కంటే అద్బుతమైన ఇమేజ్ ఉంది. దేశవిదేశాల్లో కూడా కేవలం నాలుగు చిత్రాలతో సంచలనం సృష్టించిన దర్శకుడు ఆయన. ఆయనే రాజ్‌కుమార్ హిరాణి. ఆయన తీసిన 'మున్నాబాయ్ ఎంబిబియస్, లగే రహో మున్నాబాయ్, త్రీ ఇడియట్స్, పీకె....' ఇలా ప్రతి సినిమాను తనదైన సామాజికాంశంతో ముడిపెడుతూ తీసిన ఆయన చిత్రాలు సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆయన రణభీర్ కపూర్ హీరోగా సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు. కాగా ఈచిత్రం ఈఏడాదే విడుదల కానుంది. తాజాగా ఆయన మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి సంజయ్‌దత్ హీరోగా 'మున్నాబాయ్' సిరీస్‌కు సీక్వెల్ కాగా.. రెండోది అమీర్‌ఖాన్ హీరోగా 'త్రీ ఇడియట్స్'కు సీక్వెల్. దీంతో రాజ్‌కుమార్ హిరాణి మరోసారి టాక్ ఆప్ ది టౌన్‌గా మారాడు. మరి ఈ చిత్రాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో అని యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.