బాలకృష్ణ, మోహన్ బాబు మంచి స్నేహితులు. కలిసి నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ వారి మధ్య నిత్యం సంభాషించుకునే స్నేహం ఉంది. ఈ స్నేహం కారణంగానే మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ నటించిన ఊకొడతారా ఉలిక్కిపడతారా అనే సినిమాలో బాలయ్య అతిథి పాత్రను చేశారు. ఇంతటి స్నేహం ఉన్నప్పటికీ బాలయ్య సెంచరీ చిత్ర ప్రారంభోత్సవంలో మోహన్ బాబు కనిపించకపోవడానికి కారణమేమిటీ ఈ అనుమానం చాలామందిలో ఉంది.
బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి లిమిటెడ్ గానే సహచరులను పిలిచారు. ముఖ్యంగా తన బ్యాచ్ హీరోలు అంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లను ఆహ్వానించారు. అంతేకానీ క్యారక్టర్ ఆర్టిస్టులను పిలవలేదు అనుకోవాలి. ఈ కోటాలోనే మోహన్ బాబు ఛాన్స్ మిస్సయ్యాడనే మాట ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి సైతం ఆహ్వానం లేదు. తనకంటే బాగా సీనియర్లని, తనకంటే బాగా జూనియర్లని బాలయ్య పిలవలేదని అనుకోవచ్చు.
Advertisement
CJ Advs