Advertisement
Google Ads BL

పవన్‌కు కూడా తప్పడం లేదా...?


2019 ఎన్నికల నాటికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని పవన్‌ చెబుతున్నాడు. కాగా నేడున్న రాజకీయ చిత్ర పటంలో అధికార పార్టీకి కొన్ని మీడియా గ్రూప్‌లు, విపక్షాలకు అనుకూలమైన మీడియా గ్రూప్‌లు ఉన్నాయి. ఇప్పుడు పవన్‌ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాకపోవడంతో ఆయన ఏమి మాట్లాడినా మీడియా వారు దానిని హైలైట్‌ చేస్తున్నారు. ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఆయన ఒక్కసారి పూర్తిస్థాయి రాజకీయాలోకి వచ్చిన తర్వాత అధికార, విపక్ష అనుకూల మీడియాలకు ఆయన శత్రువై పోవడం ఖాయం. పవన్‌ స్టార్‌ హీరో కాబట్టి ప్రస్తుతం ఆయన ఏమి చేసినా ఓ న్యూస్‌ అవుతుంది. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ సౌలభ్యం ఉండదు. ఈ విషయంలో పవన్‌ తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుంచుకోవాలి. పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం మీడియా వ్యవహిరిస్తే, మరో వర్గం మీడియా ఆయనను అసలు పట్టించుకోకుండా వదిలేసింది. నేటిరోజుల్లో సొంత టీవీ చానెల్‌, దినపత్రికలు లేకోపోతే రాజకీయంగా వారిని పట్టించుకునే వారే ఉండదు. ఈ విషయంలో లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణనే పెద్ద ఉదాహరణ, ఆయన పార్టీ పెట్టక ముందు ఈ టీవీ గ్రూప్‌ ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. కానీ ఒక్కసారిగా పార్టీ పెట్టి రాజకీయనాయకుడిగా మారిన తర్వాత చంద్రబాబుకు కూడా ఇబ్బంది కలగకూడదనే నెపంతో రాజగురువు గ్రూప్‌ ఆఫ్‌ మీడియా అయన్ను పక్కనపెట్టింది. సో.. పవన్‌ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఆయనకు ఎదురవుతుంది. పవన్ కూడా ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దినపత్రికలను, టీవీ చానెల్స్‌ను పెట్టడానికి తన వద్ద అంత డబ్బులేదని చెబుతున్న ఆయన త్వరలో యూట్యూబ్‌ చానెల్‌ను పెట్టనున్నారని సమాచారం. ఇక ఆయన స్నేహితుడు, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ నిర్మాత శరత్‌మరార్‌కు పలు చానెల్స్‌కు సీఈవోగా వ్యవహించిన అనుభవం ఉంది. ఈ విషయంలో పవన్‌ను శరత్‌మారార్‌, త్రివిక్రమ్‌లే ముందుడి నడిపిస్తున్నారట. శరత్‌మరార్‌ అభిప్రాయం ప్రకారం పివిపి వంటి భారీ సంస్థలను, వ్యక్తులను చేరదీసి ఆల్‌రెడీ ఇప్పుడు ఉన్న టీవీ చానెళ్లలో ఏదో ఒకదాన్ని కొనుగోలు చేయడమే బెటర్‌ అని సలహా ఇస్తున్నాడట. మరి పవన్‌ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సి వుంది...!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs