Advertisement
Google Ads BL

లెజెండరీ డైరెక్టర్‌ అంటే చిన్నచూపా!


ఇండియన్‌ సినీ హిస్టరీలోనే దర్శక దిగ్గజంగా మణిరత్నంకు ఓ పేరుంది.  ముఖ్యంగా దక్షిణాదిలో ఆయన సినిమా స్థితిగతులను మార్చేశాడు. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఏ నటీనటులైన ఆయన చిత్రంలో నటిస్తే చాలని కోరుకుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే కళ్లు మూసుకొని ఆయన చిత్రాలకు ఓకే చెబుతారు. హీరోయిన్లను తెరపై అందంగా చూపించడంతో పాటు వారికి దేశవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే స్థాయి ఆయనది. దానికి ఐశ్వర్యారాయ్‌ వంటి టాప్‌ హీరోయిన్లు కూడా అతీతం కాదు. కాగా ఈ మధ్యకాలంలో కాస్త ఫామ్‌ కోల్పోయిన ఆయన మరలా తనలోని దర్శకుడిని బయటకు తీసి, నేటి యంగ్‌ జనరేషన్‌ అభిరుచులకు తగ్గట్లుగా ఓకే కన్మణి (తెలుగులో ఓకే బంగారం) తీసి ఫామ్‌లోకి వచ్చాడు. కాగా ఆయన గత కొంతకాలంగా పలువురు హీరోలతో చిత్రాలు చేస్తున్నాడనే వార్తలు వచ్చినప్పటికీ ఏదీ పట్టాలెక్కలేదు. కాగా ప్రస్తుతం ఆయన తన శిష్యుడు కార్తి హీరోగా ఓ చిత్రం చేయనున్నాడని కన్‌ఫర్మ్‌ అయింది. కాగా ఈ చిత్రం ఆగష్టు నుండి పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలో ఆయన హీరోయిన్‌గా మలయళ టాలెంట్‌ హీరోయిన్‌ సాయిపల్లవిని కన్‌ఫర్మ్‌ చేసుకున్నాడు. కానీ ఉన్నట్లుండి ఆమె ఈ చిత్రం నుండి బయటకు వచ్చింది. సినిమాలో గ్లామర్‌షోకు, ముద్దు సీన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతోనే ఈచిత్రం నుండి సాయిపల్లవి తప్పుకుందని సమాచారం. కాగా ఇలా నేటితరం హీరోయిన్స్‌ ఆయన చిత్రాలను తిరస్కంరిండం ఈ మద్య తరచుగా జరుగుతోంది. గతంలో కూడా ఆయన తీసిన కడలి చిత్రం కోసం ఆయన శృతిహాసన్‌ను, అక్షరహాసన్‌ను, సమంతను ఇలా చాలా మంది డేట్స్‌ అడిగారు. కానీ వారు మాత్రం మొదట ఓకే చెప్పి ఆ తర్వాత హ్యాండ్‌ ఇచ్చారు. చివరకు ఆయన రాధ చిన్నకూతురు తులసితో ఈ సినిమా చేశాడు. ఈ వరస చూస్తుంటే మణిరత్నంను నేటి హీరోయిన్లు కేవలం హిట్‌ ఫ్లాప్‌లనే కొలమానంగానే తీసుకున్నట్లు అర్ధమవుతోంది. కానీ ఆయన జయాపజయాలకు అతీతుడు అన్న సంగతిని వారు మర్చిపోతున్నారు. పని చేయడం, చేయకపోవడం ఆయా హీరోయిన్ల పర్సనల్‌ విషయమే అయినా ముందు ఓకే చెప్పి తిప్పించుకొని చివరి నిమిషాల్లో మాత్రం హ్యాండ్‌ ఇవ్వడం బాధాకరం

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs