Advertisement
Google Ads BL

బాలయ్య ప్రత్యేకంగా ఆహ్వానించాడు!


నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' అనే చిత్రాన్ని దర్శకుడు క్రిష్ రూపొందించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 22న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని భావించిన బాలయ్య ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించాలనుకున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ... చారిత్రాత్మక కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం మూహుర్తం షాట్ ఓపెనింగ్ కు రావాల్సిందిగా ఆయనను కోరారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో బాలయ్య తల్లి పాత్రలో బాలీవుడ్ నటి హేమామాలిని కనిపించనుందని సమాచారం. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకమని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs