Advertisement
Google Ads BL

మెగాహీరోలు ఎందరు హాజరవుతారు....?


మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంటర్‌ అవుతున్న తొలిహీరోయిన్‌ నిహారిక. ఒక మనసుతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఓ మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంతో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈచిత్రం ఆడియో ఈనెల 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో విడుదల కానుంది. ఈ వేడుకకు చరణ్‌ రావడం ఖరారైంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ వేడుకకు హాజరవుతాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ వేడుకకు ఎందరు మెగా హీరోలు హాజరవుతారనే చర్చ ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకు ముందు నిహారిక నటించిన వెబ్‌ సీరియల్‌ ముద్దపప్పు.. ఆవకాయ కి కూడా చరణ్‌ తన వంతు సహాయం చేశాడు. ఈ సీరిస్‌కు సంబంధించిన ఒక ఎపిసోడ్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి, నిహారికను ఎంకరేజ్‌ చేశాడు. ఇప్పుడు సినిమా ఆడియో ఫంక్షన్‌కు కూడా రావాలని చరణ్‌ ఫిక్సయాడు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్‌తో కలిపి టివి9 సంయుక్తంగా నిర్మిస్తోంది. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన పొయిటిక్‌ డైరెక్టర్‌ రామరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ కూడా పొయిటిక్‌గా ఉండి అందరినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs