Advertisement
Google Ads BL

బ్రహ్మూెత్సవం పై రోజుకో వార్త!


గత కొన్నిరోజులుగా మహేష్‌బాబు, సమంత, కాజల్‌, ప్రణీతలు కలిసి నటిస్తున్న బ్రహ్మూెత్సవం కథ ఇదేనంటూ ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. పివిపి సంస్థ 

Advertisement
CJ Advs

నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. కాగా ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు, ఈ చిత్రం ఎనిమిదేళ్ల కిందట మదన్‌ దర్శకత్వంలో జగపతిబాబు, ప్రియమణి జంటగా నటించిన పెళ్లైన కొత్తలో చిత్రం కథలాగే ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జగపతిబాబు, ప్రియమణిలకు పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇంకా కొన్ని సమస్యలతో వారిద్దరూ దూరంగా ఉంటారు. వాళ్లని పెద్దలు ఎలా ఒకటి చేశారు? అనేది మిగిలిన కథాంశం. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో అదే స్టోరీ పాయింట్‌ను తీసుకొని మహేష్‌, సమంతల మద్య పెళ్లి జరిగినప్పటికీ పలు అపోహలతో వారు పెళ్లైనా కూడా విడిగావుంటారు. వాళ్లని పెద్దలు ఎలా కలిపారు? అనే పాయింట్‌ ఆధారంగానే ఈ బ్రహ్మూెత్సవం కూడా రూపొందుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే ఈ చిత్రం విడుదలయ్యే వరకు వేచిచూడాల్సివుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs