చెన్నైలో దక్షిణాది సినీ నటీనటులు క్రికెట్ ఆడినసంగతి తెలిసిందే. ఆర్టిస్టుల సొంత భవన నిర్మాణ నిధుల కోసం క్రికెట్ ఆడారు. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సీనియర్స్ ఎండను లెక్కచేయకుండా వచ్చి పాల్గొన్నారు. టాలీవుడ్ నుండి నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్ తో పాటు మరికొందరు పాల్గొన్నారు. నిధుల సేకరణ అందరి బాధ్యత కాబట్టి ఎక్కువ మంది క్రికెట్ ఆటలో పాల్గొంటే స్పాన్సర్స్ కు కూడా హుషారు ఉంటుంది.
ఈ క్రికెట్ లో మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా కనిపించలేదు. ఒక సీనియర్ నటుడిగా, గతంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఫౌండర్ ప్రసిడెంట్ గా ఆయనకు ఎక్కువ బాధ్యత ఉంది. చిరంజీవి సినిమా ఇంకా మెుదలుకాలేదు కాబట్టి ఆయన బిజీగాలేరు. పార్లమెంట్ సమావేశాలు లేవు కాబట్టి ఢిల్లీ వెల్లలేదు. మరి ఎందుకని గైర్హాజరు అయ్యారో ఆయనే వివరణ ఇవ్వాలి. ప్రత్యేక కారణం ఏదైనా ఉన్నపక్షంలో తన వారసుడిని పంపించి ఉండాల్సింది. మొత్తంగా మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ కూడా అటువైపు కన్నెత్తి చూడలేదనేది సుస్పష్టం. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం వల్ల చిరంజీవి సాధించిందేమిటీ.
Advertisement
CJ Advs