అల్లు అర్జున్ ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది.. స్టైలిష్ స్టార్. తన బిరుదుకి తగ్గట్లుగానే స్టైల్ లో యూత్ కి ఐకాన్ బన్నీ. మెగాఫ్యామిలీ అని పేరు చెప్పి బ్రతికేయకుండా.. తనకంటూ.. ప్రత్యేక గుర్తింపును పొందడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. మెగా హీరో అని కాకుండా బన్నీకు సెపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఈరోజు తను నటించిన 'సరైనోడు' సినిమా సుమారుగా డెబ్బై కోట్లు బిజినెస్ చేసిందంటే బన్నీ క్రేజ్ ఏంటో..? తెలుస్తుంది. అయితే బన్నీ జీవితంలో ఐదు లక్ష్యాలు ఉన్నాయట. అవి నెరవేర్చుకోవడం కోసమే కష్టపడుతున్నాని చెబుతున్నాడీ నటుడు. అవేమిటంటే.. మొదటగా సౌత్ లో ఐకానిక్ హీరోగా మారాలి.. గవర్నమెంట్ నుండి గుర్తింపు పొందేలా ఒక అవార్డును సొంతం చేసుకోవాలి.. ప్రతి ఏడాది చేసే సినిమా పురస్కారాలలో తన సినిమాలు ఉండేలా చూసుకోవాలి.. తన కెరీర్ లో ట్రెండ్ సెట్ చేసే విధంగా కనీసం ఐదు సినిమాలైనా ఉండాలి.. చివరగా ఏదైనా స్వచ్చంద సంస్థను స్థాపించి.. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల నుండి గుర్తింపు తీసుకురావాలి. ఇవే తన జీవితగా లక్ష్యాలని, వాటి కోసం కృషి చేస్తున్నాని బన్నీ తన మనసులో మాటలను చెప్పుకొచ్చాడు.