తన సినిమా 24 విడుదల తేదీని అనౌన్స్ చేయడానికి తమిళ్ హీరో సూర్య నిన్న హైదరాబాద్ వచ్చాడు. డ్యుయల్ రోల్స్ చేయడం ఎలా అన్పించింది అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇక ముందు మళ్ళీ ద్విపాత్రాభినయం చేయను అని చెప్పాడు. డ్యుయల్ రోల్స్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. 24 చేసేప్పుడు ఆ విషయం తెలిసి వచ్చింది, అని అన్నాడు సూర్య. అయితే, సూర్య గతంలో సూర్య సన్ అఫ్ కృష్ణన్, 7th సెన్స్ లాంటి సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసాడు. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ పేరు ఘడించిన విక్రం కుమార్ ఈ సారి మరొక అద్భుతమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 24 సూర్య కెరీర్ లో ఒక గొప్ప మైలురాయిగా మిగులుతుంది అని చెప్పాడు. కథ నచ్చడంతో, సూర్య 24ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. గ్లోబల్ సినిమా వాళ్ళు పెద్ద మొత్తం చెల్లించి తెలుగు పంపిణి హక్కులు పొందారు. సూర్య పర్ఫార్మెన్స్, విక్రం డైరెక్షన్ తో పాటు, సమంతా, నిత్య మీనన్ గ్లామర్ 24కి అదనపు ఆకర్షణ అవ్వనున్నాయి. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ మే నెల 6న విడుదలకు సిద్దమౌతుంది.