Advertisement
Google Ads BL

యంగ్ స్టార్స్‌ కి బోయపాటి 'సరైనోడు' అవుతాడా!


తన కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన బోయపాటి శ్రీను నాలుగు హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆయనపై ఒక అపనమ్మకం కూడా ఉంది. ఆయన కుర్రస్టార్‌ హీరోలను సరిగా హ్యాండిల్‌ చేయలేడనే అపవాదు  ఆయనపై ఉంది. ఎన్టీఆర్‌తో ఆయన 'దమ్ము' చూపించలేకపోయాడు. కానీ ఇప్పటివరకు ఆయన సీనియర్‌ స్టార్స్‌తో చేసిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. 'భద్ర, తులసి, సింహా, లెజెండ్‌' చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచినా ఎన్టీఆర్‌తో ఫ్లాప్‌ చిత్రం చేశాడు. అలాగే ఆయన రామ్‌చరణ్‌, మహేష్‌బాబులకు కూడా స్టోరీలు వినిపించాడు. కానీ అవి చర్చల దశలోనే ఆగిపోయాయి. దాంతో కుర్రస్టార్స్‌ను ఆయన సరిగ్గా హ్యాండిల్‌ చేయలేడనే విమర్శ మరింత ఎక్కువైంది. ఆ అపనిందను తొలగించుకోవాలంటే ఆయన ప్రస్తుతం బన్నీతో చేస్తున్న 'సరైనోడు' చిత్ర విజయం ఆయన కెరీర్‌కు పెద్ద అగ్నిపరీక్షగా మారింది. మాస్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే బోయపాటి 'సరైనోడు'లో కూడా అల్లుఅర్జున్‌ చేత ఊరమాస్‌ చేయిస్తున్నాడు. ఆయన సినిమాకు కత్తులుంటే చాలు. రక్తం ఏరులైపారుతుంది. సినిమా మొత్తం రక్తపాతం, ఊచకోతలు ఉంటాయి. దానికి తగ్గట్లుగానే 'సరైనోడు' ట్రైలర్‌ కూడా యాక్షన్‌తో నిండిపోయింది. ఇప్పటికే ఈచిత్రం 60కోట్లకుపైగా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. మరి బన్నీ నమ్మకాన్ని బోయపాటి నిలబెడతాడా? లేదా? అనేది ఏప్రిల్‌22న తేలిపోతుంది. 

Advertisement
CJ Advs

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రాన్ని సెన్సార్‌కు పంపితే అందులోని ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో మరీ భయాతి భయానకంగా రక్తం ఏరులై పారడం, అక్కడ జరిగిన ఊచకోత చూసి భయపడిన సెన్సార్‌ సభ్యులు ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్‌ ఇస్తామని చెప్పారట. కానీ నిర్మాత అల్లుఅరవింద్‌ మాత్రం తమ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికేట్‌ కావాలని కోరడంతో, ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తీసి వేయమని సెన్సార్‌ సభ్యులు సూచించినట్లు సమాచారం. కానీ ఆ ఫైట్‌ను తీసివేయలేం గానీ కావాలంటే మరీ అంత వయలెంట్‌గా కాకుండా మరలా ఆ ఫైట్‌ను రీషూట్‌ చేస్తామని చెప్పి రామోజీఫిలింసిటీలో రీషూట్‌ చేసినట్లు సమాచారం. దీంతో ఈచిత్రానికి 'యు/ఎ' ఖరారైందని తెలుస్తోంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs