మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభ దశలోనే బాలీవుడ్ లో సినిమా చేశాడు. తొలి ప్రయత్నంలోనే 'జంజీర్' సినిమాతో ఫ్లాప్ రుచి చవిచూశిన ఈ నటుడు మరోసారి బాలీవుడ్ లో నటించానున్నడనే వార్తలు వచ్చాయి. అయితే సోలో హీరోగా వర్కవుట్ కావట్లేదని భావించిన చరణ్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన రామ్ చరణ్, ఆ మాటల్లో నిజం లేదని తేల్చేశాడు. నేను హిందీలో చేయబోయే తదుపరి సినిమాను సల్మాన్ ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు కానీ ఆయన మాత్రం నటించరని చెప్పారు. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని.. తనే మల్టీస్టారర్ సినిమాకు కమిట్ కాలేదని చెప్పుకొచ్చారు.