మంచు కుటుంబంలో చెప్పేవాటికి చేసేవాటికి పొంతనే ఉండదు. వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా తమ ఇమేజ్ గురించి ఎక్కువ అంచనాలు వేసుకుంటారు. గురువారం నాడు మంచు విష్ణు ఇంటర్య్వూ కేవలం 'ఈనాడు' దినపత్రికలోనే కనిపించింది. అందులో వస్తే చాలు అదే 'పదివేలు' అని భావించినట్టున్నాడు. అందుకే ఇతర పత్రికలను మరిచాడు. సరిగ్గా సినిమా రిలీజ్ రోజే ప్రత్యేకంగా ఇంటర్యూ చేసి వేయడం ఎందుకో. ఇక ఇంటర్య్వూలో విష్ణు చాలా పెద్ద మాటలే చెప్పారు. మరో హీరోతో కలిసి నటించడానికి సిద్దమన్నాడు. మంచి సినిమాలు తీయాల్సింది దర్శకులే అని సెలవిచ్చాడు. దర్శకులకు అంత స్వేఛ్చ ఇస్తే నిజంగా మంచి సినిమాలే వస్తాయి. మరి 'ఈడో రకం - ఆడోరకం' చిత్ర దర్శక, నిర్మాతపై తాను ఎందుకు అలిగాననే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చిత్ర నిర్మాత ఎంతో సంతోషంగా గుమ్మడికాయ ఫంక్షన్ పెట్టుకుంటే విష్ణు డుమ్మా కొట్టాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. కేవలం తనకు సరైన మర్యాద ఇవ్వడం లేదనే విష్ణు డుమ్మా కొట్టాడని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వారితో మల్టీ హీరోల సినిమాలు ఎలా తీస్తారు.
ఇక 'ఈడు..-ఆడు..' సినిమా నిలబడడం కష్టమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అంటే ఇద్దరు హీరోలు విష్ణు, రాజ్ తరుణ్ జాయింట్ గా ఫ్లాప్ కొట్టారన్నమాట.