Advertisement
Google Ads BL

ఆదిత్య 369, సూర్య 24 ఒక్కటేనా?


నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాంకేతికత పెద్దగా అందుబాటు లేని ఆ కాలంలో కూడా సింగీతం తన ప్రతిభతో ‘ఆదిత్య 369’ను అద్భుతమైన సినిమాలా మలిచాడు. టైమ్‌మిషిన్ నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతో థ్రిల్ల్ చేసింది. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ టైమ్‌మిషిన్ నేపథ్యంలో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘24’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రొటిన్ సినిమాలు చేయడం, తీసిన జోనర్‌లో సినిమాలు తీయడం.. అలవాటు లేని సూపర్ డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో చిత్రంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రం కూడా ఆదిత్య 369లా టైమ్‌మిషిన్ నేపథ్యంలో రూపొందడంతో ఈ రెండు చిత్రాలకు కథలో సారూప్యత వుంటుందని అనుకుంటున్నారు సినీజనాలు. అయితే రెండు చిత్రాల కథలు వేరు అయినా బహుశా విక్రమ్‌కుమార్ ‘ఆదిత్య 369’ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని వుండొచ్చనే సందేహలు బయలుదేరాయి. సో..ఏది ఏమైనా '24' విడుదల తర్వాతే ఈ సస్పెన్స్‌కు తెరపడుతుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs