ప్రభుత్వం చేసే ప్రతి పనిలో లోపాలు వెతికే కమ్యూనిస్టులకు తాము చెస్తున్న తప్పులు మాత్రం కనిపించవు. ఇంకా ప్రయివేట్ కంపెనీల్లో కార్మికులను తొలిగిస్తే అరచిగోల చేస్తారు. అన్యాయం అంటారు. మరి వారే ఈ పనిచేస్తే సరిగ్గా అదే జరిగింది. సి.పి.ఐ. అనుబంధ పత్రిక విశాలాంధ్ర అనే విషయం తెలిసిందే. రాష్ట్రాలు విడిపోవడంతో మన తెలంగాణ అని టైటిల్ తో మరో పత్రిక నడుపుతున్నారు. జర్నలిస్ట్ నాయకుడు శ్రీనివాసరెడ్డి దీనికి ఎడిటర్. నాయకుడే ఎడిటర్ కావడం అంటే జర్నలిస్ట్ లకు మరింత మంచి జరగాలి. కానీ దీనికి రివర్స్ జరిగింది. ఇటీవలే మన తెలంగాణ పత్రిక నుండి 50 మంది జర్నలిస్ట్ లను ఉద్యోగాల నుండి తొలగించారు. వారి జీవితాలను రోడ్డున పడేశారు. ఒకవైపు ప్రభుత్వం నుండి ప్రకటనలు తీసుకుంటూనే, జర్నలిస్ట్ ల హక్కుల గురించి వేదికలపై నుండి మాట్లాడూతూనే అకస్మాత్తుగా 50 మందిని తొలగించడం అంటే ఎంతటి దారణమో అర్థం చేసుకోవచ్చు. ఎదుటివారికి చెప్పేందుకు మాత్రం నీతులుంటాయి పాటించడానికి మాత్రం ఉండవు. మరి ఈ సంఘటనపై కమ్యూనిస్టులు పెదవి విప్పరు. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళే కనుక. అదే వేరే పత్రికలో ఇలా జరిగితే మాత్రం ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు. ఇది కమ్యూనిజం తీరు.