అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా మారిపోయింది రెజీనా పరిస్థితి. ఆమె... అందం, అభినయం, అందాల ఆరబోత, లిప్ టు లిప్, లిప్‌లాక్‌లకు కూడా తలుపులు తెరిచే ఉంది. ఏడాది ముందు మాత్రం ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. తనతోపాటే చిత్ర సీమకు వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్, రాశిఖన్నా వంటి హీరోయిన్లు దూసుకుపోతుండగా, రెజీనా మాత్రం రేసులో వెనకబడిపోయింది. ముఖ్యంగా ఆమె నటించిన 'శౌర్య, సౌఖ్యం' చిత్రాలు డిజాస్టర్ కావడంతో ఈమె దురదృష్టం మరింతగా బలపడింది. ఇప్పటికే ఆమె నారారోహత్‌తో కలిసి 'శంకర' చిత్రం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలోనే ఆమెకు సాయికొర్రపాటి నిర్మాతగా, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న 'జ్యో అచ్యుతానంద'లో అవకాశం వచ్చింది. వారాహి చలన చిత్రం వంటి మంచి నిర్మాణసంస్థలో నారారోహిత్ సరసన ఆమె నటించనున్న ఈ 'జ్యో అచ్యుతానంద' చిత్రమైనా ఆమె కెరీర్‌కు ఎలా హెల్ప్ అవుతుందో వేచిచూడాల్సివుంది....!