కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్ ఊపిరి. తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించి సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌కి బాగా డిమాండ్ పెరిగింది. తెలుగు, తమిళ వెర్షన్స్‌కి భారీ ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి. కింగ్ నాగార్జునకి మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సూపర్‌హిట్స్ తర్వాత వచ్చిన ఊపిరి హ్యాట్రిక్ హిట్ చిత్రంగా నిలిచింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లికి బృందావనం, ఎవడు చిత్రాల తర్వాత హ్యాట్రిక్ సినిమా ఇది. కార్తీ, తమన్నా జంటకి కూడా ఊపిరి హ్యాట్రిక్ మూవీ అయింది. పివిపి సినిమా బేనర్‌కి బలుపు, క్షణం తర్వాత ఇది మూడో ఘన విజయం కావడం విశేషం. అలాగే ఊపిరి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సబ్జెక్ట్ అవడంతో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌కి మరింత డిమాండ్ పెరిగింది. ఈ వారంలోనే ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఎవరికి ఇచ్చేది ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.