Advertisement
Google Ads BL

అక్కడ 'సర్దార్' మరీ దారుణం!


'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' హిందీ వెర్షన్‌ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు బాలీవుడ్‌ ట్రేడ్‌వర్గాల సమాచారం. తెలుగు రెండు రాష్ట్రాల్లో తొలిరోజు రికార్డులు బద్దలు కొడితే హిందీ వెర్షన్‌ మొదటి రోజు ఓపెనింగ్స్‌ ఓ మాదిరిగా కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికీ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ వారు ఈ చిత్రం హిందీ వర్షెన్‌ రిలీజ్‌ ప్రమోషన్‌ కోసం భారీగా ఖర్చుపెట్టారు. దాదాపు 5కోట్లు ఖర్చుపెట్టి హిందీలో రిలీజ్‌ చేశారు. తొలిరోజు చాలా తక్కువ వసూలు చేసి నిరాశపరిచింది అంటే తొలిరోజే పూర్తిస్ధాయి డెఫిషిట్‌ నమోదు చేసిందన్నమాట. ఈ సినిమాకు బాలీవుడ్‌లో చాలా బ్యాడ్‌ రివ్యూలు రావడం, అసలు మౌత్‌టాకే లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద పూర్తిగా వెనుకబడింది. పవన్‌ అప్పటికీ హిందీ మీడియాకు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. పెద్ద పెద్ద మీడియా సంస్థల సహకారంతో ఈ సినిమా గురించి గొప్పగా రాయించారు... చెప్పించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs