ఆదివారం నాడు తీరిక చేసుకుని మీడియా ముందుకువచ్చిన పవన్ ఇంతకి చెప్పిందేమిటీ?. సర్దార్.. ప్రమోషన్ గురించా? లేక తన భవిష్యత్తు ప్రణాళిక గురించి విశ్లేషించాడా?. తన సినిమా రిలీజ్ అయ్యాక దాని గురించి పట్టించుకోనంటూ కుండబద్దలు కొట్టారు. హీరోకే ఆ పట్టింపులేకపోతే అభిమానులకు ఉంటుందా. ఒకవైపు సర్దార్... బయ్యర్లు లబోదిబో అంటుందే బాధ్యత కలిగిన హీరోగా నష్టనివారణ చర్యలు చేపట్టాలి. పైగా ఈ సినిమాకు ఆయనే కథకుడు.కాబట్టి పూర్తి బాధ్యత వహించాలి. ఇవేమీ పవన్ కల్యాణ్ కు పట్టలేదు. రెండున్నర సంవత్సరాలు ఊరించి ఊరించి తీసిన సినిమా బక్సాఫీస్ వద్ద చతికిల పడింది. పవన్ స్టార్ డమ్ ఓపనింగ్స్ కే పరిమితమైంది. హిందీలో రిలీజ్ చేస్తే కేవలం రెండు శాతం కలక్షన్లు వచ్చాయి. విదేశీ మార్కెట్ కుదేలైంది. ఇంతటి ప్రకంపలను సృష్టించిన సర్దార్... సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సినిమా ప్రమోషన్ కోసం కనీసం వాటి గురించి చెబితే బావుండేదని బయ్యర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా తీయడం మాత్రమే గొప్పదనం కాదు దాన్ని ప్రేక్షకుల చెంతకు తీసుకెళ్ళడంలోను శ్రద్దచూపాలి.
పవన్ కల్యాణ్ తన ఆర్థిక పరిస్థితి గురించి, వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి మాత్రం చెప్పుకొచ్చారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని విశ్లేషకులు అంటున్నారు. నటుడిగా తనకే జడ్జిమెంట్ లేదు. అలాంటాయన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనను ప్రశంసించడం మరీ విడ్డూరం. ప్రశ్నించడానికి మరికొంతకాలం ఆగుతానంటూ చెప్పి ఆశ్చర్యపరిచారు. తన పనులన్నీ పూర్తిచేసుకుని తీరిగ్గా ప్రశ్నిస్తే అప్పటి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.ప్రజలకు సేవ చేయాలనుకునే నేత ఇలా ఆలోచించడు.
తన కళ్ళ ముందు అన్యాయం జరిగితే సహించనన్నాడు. సర్దార్...సినిమాకు సంపత్ నందిని దర్శకునిగా తీసుకుని రెండేళ్ళ తర్వాత నెట్టేశారు. ఇది అన్యాయంగా పవన్ కు కనిపించలేదేమో. కుల వ్యవస్థ పోవాలని అంటాడు. కాపులకు రిజర్వేషన్లు కావాలంటాడు. అన్నయ్యతో రాజకీయ విభేదాలున్నాయని సెలవిచ్చాడు. చిరంజీవి రాజకీయాల్లో యాక్టివ్ గానే లేరు. అలాంటప్పుడు విభేదాల ప్రస్తావన ఎందుకువస్తుంది. అలా అనే ఖాళీలను పూరించకుండానే పవన్ మాట్లాడారు.
సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ మీడియాను సైతం విభజించారు. తనకు అనుకూలం అని భావించినవారినే పిలిచి ఇంటర్య్వూలు ఇచ్చారు. ఇది మరీ విడ్డూరం. రాజకీయ నేతకు ఉండకూడని ప్రధమ లక్షణం ఇది.
పవన్ మిడిమిడి పరిజ్ఞానం రాజకీయాలకు సరిపోదని ఆయన సమాధానాలు చూసి ఎవరైనా భావిస్తారు.
Advertisement
CJ Advs