Advertisement
Google Ads BL

'సర్దార్‌' ఫలితం చూసి ఆనందపడుతున్నారు!


పవన్‌కళ్యాణ్‌ నటించిన 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రానికి ఫ్లాప్‌ టాక్‌ రావడంతో కొందరు ఇండస్ట్రీ వ్యక్తులు ఆనందపడుతున్నారనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో ప్రధాన చర్చనీయాంశం అయింది. ఈ చిత్రం హిట్టయితే మరో రెండు మూడు వారాలు తిరుగుండదని కొందరు భయపడ్డారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌ ఫలితాన్ని మూటగట్టుకోవడంతో తమ సినిమాలను ఎప్పుడు రిలీజ్‌ చేయాలా? అని తర్జనభర్జన పడుతోన్న మంచు విష్ణు 'ఈడో రకం.. ఆడో రకం' చిత్ర యూనిట్‌తో పాటు ఏప్రిల్‌ 14న తమిళ మూవీ 'తేరీ' డబ్బింగ్‌ వెర్షన్‌ 'పోలీసోడు'ను ఎప్పుడు రిలీజ్‌ చేయాలా? అని భయపడిన నిర్మాత దిల్‌రాజు కూడా 'సర్దార్‌' చిత్రం ఫలితం చూసి అనందపడుతూ ఇక తన సినిమాను 14నే తేవాలని డిసైడ్‌ అయ్యారు.
మరోవైపు మార్చి 25న విడుదలైన 'ఊపిరి' చిత్ర బృందం కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నవారిలో ఉన్నారని చెప్పకతప్పదు. ఈ చిత్రానికి 'సర్దార్‌' వచ్చే వరకే కలెక్షన్లు ఉంటాయని, 'సర్దార్‌' హిట్టయితే తమ 'ఊపిరి' చిత్రానికి కలెక్షన్లు ఉండవని ఈ చిత్ర యూనిట్‌ భావించింది. కానీ 'సర్దార్‌' అనుకోకుండా డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకోవడంతో 'ఊపిరి' చిత్ర యూనిట్‌ ఊపిరి పీల్చుకుంది. మూడోవారంలో కూడా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోంది. ఇక అమెరికాలో ప్రసుత్తం 'ఊపిరి' చిత్రం 70 స్క్రీన్స్‌లో ఆడుతోంది. తాజాగా ఈచిత్రం టిక్కెట్ల రేట్లను తగ్గించడంతో మరలా ఈ చిత్రానికి మరో రెండువారాలు తిరుగుండదని 'ఊపిరి' బృందం భావిస్తోంది.
మరోపక్క 'సర్దార్‌' చిత్రం ఫలితం చూసి అల్లుఅరవింద్‌, అల్లుఅర్జున్‌లు కూడా తెగసంబరపడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుసగా 'బ్రూస్‌లీ, సర్దార్‌' చిత్రాలతో రామ్‌ చరణ్, చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల చిత్రాలు బాగా డిజాస్టర్‌ ఫలితాలను అందుకోవడంతో మెగాభిమానులు డల్‌గా ఉన్నారని, ఈ సమయంలోనే బన్నీ నటిస్తున్న 'సరైనోడు' చిత్రం మంచి ఫలితాలను రాబడితే అది బన్నీ కెరీర్‌కు ఎంతగానో మైలేజ్‌ ఇస్తుందనేది వీరి ఆలోచనగా చెబుతున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs