ఒక్కసారి తన కెరీర్ ఊపందుకున్న తర్వాత శ్రీనువైట్లతో చిత్రాలు చేయాలని అందరూ ఆసక్తి చూపించారు. ముఖ్యంగా 'ఢీ' నుండి మొదలైన ఆయన ప్రస్ధానం 'దూకుడు' వరకు దూకుడుగానే సాగింది. ఆయన ఏ కథ చెప్పినా కూడా ఆయన చెప్పిన కథలు అందరికీ నచ్చేశాయి. కానీ 'ఆగడు'తో ఈ పరంపరకు బ్రేక్‌లు పడ్డాయి. దాంతో ఆ తర్వాతి చిత్రం 'బ్రూస్‌లీ' విషయంలో కూడా శ్రీనువైట్ల చెప్పిన కథకి ఎన్నో మార్పులు, చేర్పులు చేసింది మెగాకాంపౌండ్. అంతేకాదు తనతో విడిపోయిన కోన, గోపీమోహన్‌లతో పనిచేయాల్సిందే అని మెగా కాంపౌండ్ ఇచ్చిన ఆదేశానికి కూడా శ్రీను తలవంచాడు. ఈ చిత్రం ప్రారంభం విషయంలో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఆయన అన్నింటిని భరించాడు. కానీ ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో ఇక శ్రీనువైట్ల అంటే అందరు హీరోలు దూరంగా ఉంచారు. ఒకప్పుడు ఏ కథ చెప్పినా నచ్చిందని ఒప్పుకొన్న హీరోలే ఇప్పుడు ఆయన ఏ కథ చెప్పినా నచ్చడం లేదంటున్నారు. చివరకు వరుణ్‌తేజ్ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయాడు. వాస్తవానికి వరుణ్‌తేజ్- శ్రీనువైట్లల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాన్ని ఉగాదినాడు ప్రారంభిస్తామని నిర్మాతలు అఫీషయల్‌గా కూడా తెలిపారు. కానీ ఈ చిత్రం ఉగాదికి ప్రారంభం కాలేదు. ఈ చిత్రం స్క్రిప్ట్‌లో వరుణ్‌తేజ్ కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడని, దాంతో శ్రీనువైట్ల ఐదు సినిమాల అనుభవం కూడా లేని వరుణ్‌తేజ్ మాటలకు కూడా తలొగ్గాల్సి వస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజమే.. ఫ్లాప్ డైరెక్టర్ అంటే అందరికీ లోకువే కదా..!