ఈ రోజు (10-04-16) పవన్ ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా 2, 3 సినిమాలు చేసిన తర్వాత ఇక సినిమాలకు స్వస్తి చెప్తా అని, కుటుంబ పరంగా నాకు అన్నయ్యకి మంచి సంబందాలున్నాయని... రాజకీయం గా అన్నయ్య ఎప్పటికి నాకు ప్రత్యర్డే అని పవన్ ఈ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఇంకా సామాజిక అంశాలపై నేను సినిమాలు తియ్యడానికి నేను ఎప్పుడూ సిద్దమే. నాకు నచ్చని పని నేను ఎప్పటికి చెయ్యను. నేను మాట్లాడే ప్రతి మాటకు బాద్యత తీసుకుంటా. నేను ఒక మాట మాట్లాడితే వెనక్కి తీసుకొను. రాజకీయాల్లో అంతా చెప్పే చేస్తా అని చెప్పారు. పూర్తీ స్థాయి రాజకీయాల్లోకి వస్తా అని.. 2019 ఎన్నికల్లో పోటి చేస్తా అని చెప్పారు. జనసేన లోకి రమ్మని అన్నయ్యని అడగను. అలాగే అన్నయ్య పూర్తిగా కాంగ్రెస్ వాది. సాంస్కృతికంగా తెలంగాణ, ఏపీ ఇకపై కలవలేవని పవన్ అన్నారు. ఇంకా సినిమాల గురుంచి మాట్లాడుతూ రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతా.. నా స్టైల్ లో నేను చేసుకుంటూ పోతాను అని చెప్పారు. తెలుగులో తమిళ సినిమా మార్కెట్ బాగా వుందని.. తెలుగు సినిమా తమిళ్ లోకి వెళ్ళడానికి భయపడుతుందని అన్నారు. నేను ప్రయోగాలు చెయ్యడానికి భయపడను అని చెప్పారు. నేను స్టార్ డం ని ఎప్పుడు అనుభవించాలని అనుకోలేదని ప్రత్యేక మేనరిజం ఇష్టం ఉండదని చెప్పారు. చివరిగా నేను స్టాఫ్ కి జీతాలు ఇవ్వడానికి కూడా కష్టపడుతున్నానంటూ పలు ఆసక్తికర విషయాలు ఈ ఇంటర్వ్యూ లో పవన్ తెలిపారు.