సహజంగా కొత్త సినిమాలు స్టూడియోల్లో ప్రారంభిస్తారు. వచ్చే అతిథులకు సౌకర్యంగా ఉంటుంది. స్టూడియోను డెకరేషన్ చేయవచ్చు. పలువురు సినీ ప్రముఖులు కూడా వస్తారు. అయితే శనివారం దీనికి భిన్నంగా జరిగింది. దాసరి నారాయణరావు ఇంట్లోనే కొత్త సినిమా షూటింగ్ మెుదలైంది. ఇందులో విశేషం ఏమిటని అనుకోవద్దు. నిజానికి ఈ చిత్రాన్ని తొలుత స్టూడియోలోనే ప్రారంభించాలని ప్లాన్ చేశారు. దాసరిని క్లాప్ కొట్టడానికి పిలిచారు. కానీ ఆయన ఎప్పటిలాగే అనారోగ్యం కారణం చూపుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. నిర్మాతలు మాత్రం పట్టువిడవలేదు. మీరు క్లాప్ కొడతానంటే మీ ఇంట్లోనే ప్రారంభిస్తాం అన్నారట. ఇంకేం తప్పించుకోవడానికి వీల్లేక ఆయన సరే అన్నారు. ఆ విధంగా మంత్రం..తంత్రం... యంత్రం అనే సినిమాకు శ్రీకారం చుట్టారు.
ఉగాది రోజున దాసరి, రామానాయుడు స్టూడియోలో మెుదలైన ఒక సినిమాకు ప్రత్యేకంగా విచ్చేసి క్లాప్ కొట్టారు. మరుసటి రోజుకే ఆయనకు అనారోగ్య సమస్య ఎదురైంది. అయితేనేం ఒక ప్రఖ్యాత దర్శకుడి ఇంట్లోనే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన ఘనత మంత్రం...తంత్రం... యంత్రం యూనిట్ కు దక్కింది.
Advertisement
CJ Advs