ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన హవాను సాగించింది త్రిష. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాన్, ప్రభాస్ ఇలా అందరి హీరోల సరసన నటించింది. కెరీర్ పరంగా తన లైఫ్ తృప్తికరంగా ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం తను కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంది. గత సంవత్సరం పెళ్లి పీటల వరకు వెళ్ళిన త్రిష పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. అయినా.. భయపడకుండా తన కెరీర్ పై ద్రుష్టి పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీగా మారింది. రీసెంట్ గా త్రిషను డేటింగ్ పై మీ అభిప్రాయమేంటని ప్రశ్నించగా.. తనకు అసలు ఆ పదమంటేనే నచ్చదని చెప్పింది. ఏదో ప్లాన్ చేసుకొని అమ్మాయి, అబ్బాయి కలిసి ఉంటే అది నా దృష్టిలో డేటింగ్ కాదని.. ఇద్దరూ సహజంగా కలిసి ఉంటేనే బావుంటుందని చెప్పింది. అయితే మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే త్రిష అలా సహజంగా ఓ వ్యక్తితో కలిసి బయటకు వెళ్లిందట. తనతో కలిసి చదువుకునే ఓ అబ్బాయి ఇంటికి త్రిష వెళ్ళినప్పుడు తను త్రిష కోసం వంట చేసి పెట్టాడంట. ఈ విషయాలను సరదాగా షేర్ చేసుకుంది త్రిష.