'చిత్రం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో దర్శకునిగా పరిచయమయ్యాడు తేజ. ఆ తరువాత 'నువ్వు నేను','జయం' వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి సక్సెస్ లను అందుకున్నాడు. అయితే రీసెంట్ గా మాత్రం తేజకు చెప్పుకోదగ్గ హిట్టు సినిమా పడలేదు. దీంతో రాజశేఖర్ ను విలన్ గా పరిచయం చేస్తూ.. 'అహం' అనే సినిమాను రూపొందించాలనుకున్నాడు. వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయో.. లేక రెమ్యునరేషన్ విషయంలో సెట్ కాలేదో తెలియదు కానీ.. రాజశేఖర్ ను ఈ సినిమా నుండి తప్పించాడు తేజ. ఈ పాత్ర కోసం హీరో రవితేజను సంప్రదించారట. రవితేజకు నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా.. తేజ హిట్ కొడతాడేమో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఉగాది రోజున అధికారికంగా వెల్లడించనున్నారు.