'అలా మొదలైంది' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన దర్శకురాలు నందిని రెడ్డి. ఆ తరువాత తన డైరెక్షన్ లో వచ్చిన 'జబర్దస్త్' సినిమా ఫ్లాప్ కావడంతో చాలా రోజులు గ్యాప్ తీసుకొని 'కళ్యాణ వైభోగమే' సినిమా చేసింది. ఈ సినిమాతో హిట్ కొట్టిన నందినితో యువ హీరోలు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపధ్యంలో నందిని రీసెంట్ గా నితిన్ ను కలిసి ఓ కథ వినిపించిందట. నితిన్ కు ఈ స్టోరీ బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నితిన్ 'అ ఆ' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత నందిని సినిమా మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!