Advertisement
Google Ads BL

శైలజ.. 100 రోజుల తర్వాత హీరోకి క్లారిటీ!


గత కొన్నేళ్లుగా అంటే 'కందిరీగ' తర్వాత హిట్‌లేని యంగ్‌ హీరో రామ్‌కు ఈ ఏడాది మొదటిరోజున విడుదలైన 'నేను.. శైలజా' చిత్రం మరలా మంచి హిట్‌ను అందించింది. కాగా ఈ చిత్రంతో రామ్‌కు సక్సెస్‌ రావడంతో ఆ ఊపును కొనసాగించాలనే ఉద్దేశ్యంతో రామ్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తాను మరలా కిషోర్‌ తిరుమల డైరెక్షన్‌లోనే మరో చిత్రం చేస్తానని రామ్‌ ప్రకటించాడు. కానీ కిషోర్‌ తిరుమల మాత్రం వెంకటేష్‌, నితిన్‌ చిత్రాలతో బిజీ అయిపోయాడు. ఇక రామ్‌.. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. చివరకి 'నేను..శైలజ' తర్వాత 100రోజులకు గానీ రామ్‌ నటించే తదుపరిచిత్రంపై క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఆయన నటించే చిత్రంపై ఓ క్లారిటీ వచ్చింది. 'కందిరీగ' దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో రామ్‌ ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని 14రీల్స్‌ సంస్థ నిర్మించనుంది. 'కందిరీగ' వెంటనే మరోసారి సంతోష్‌ శ్రీనివాస్‌తో రామ్‌ చిత్రం చేయాల్సిఉంది. కానీ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో వచ్చిన విబేదాల కారణంగా ఈ చిత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో 'రభస' చిత్రం చేశాడు. అది డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో సంతోష్‌ శ్రీనివాస్‌కు కూడా మరే చిత్రానికి అవకాశం రాలేదు. ఎట్టకేలకు ఓ మంచి సబ్జెక్ట్‌ ను  రామ్‌కు వినిపించాడని, స్టోరీ నచ్చడంతో రామ్‌ కూడా ఓకే చెప్పాడని సమాచారం. కాగా ఈ చిత్రం ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో గానీ పట్టాలెక్కే అవకాశం ఉంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs