కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె నిర్మించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించి యు.ఎస్.లో 2 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసే దిశగా వెళుతోంది. ఇది ఇలా వుంటే ఇటీవలే బిజెపి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చుట్టూ తిరిగి ఆయన కోసం ప్రత్యేకం గా ఓ షో ఏర్పాటు చేసి ఆయన మన్ననలను పొందే ప్రయత్నం చేశాడు పరమ్ వి.పొట్లూరి. ఇక్కడే అసలు ట్విస్ట్ వుందని అందరూ భావిస్తున్నారు. గత కొద్ది రోజుల ముందు వరకు పివిపి.. టీడీపీ లో చేరబోతున్నాడనే వార్తలు వినిపించాయి. కానీ తాజా పరిణామాలు చూసిన కొందరు టీడీపీ కాదు.. బిజెపి లో చేరటానికే పివిపి ఈ ప్రయత్నాలన్నీ అని చెప్పుకుంటున్నారు.