'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటి అవికా గోర్. ఈ సినిమా తరువాత ' లక్ష్మీ రావే మా ఇంటికి','సినిమా చూపిస్త మావ' చిత్రాలతో తెలుగులో అవకాశాలను అందిపుచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా నటిస్తోన్న ఈ భామ సినిమాలకు దూరం కావాలనే నిర్ణయం తీసుకుందట. కెరీర్ సాఫీగా సాగుతున్న ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని తప్పు చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ముందుగా తన చదువు పూర్తి చేయాలనే ఆలోచనలో అవికా ఉంది. దీని కోసం కొంత కాలం సినిమాలను పక్కన పెట్టి చదువు మీద ధ్యాస పెట్టడానికి ఫిక్స్ అయింది. చదువు పూర్తయిన తరువాత సినిమాలను కంటిన్యూ చేస్తానని చెబుతోంది. ఒకసారి సినిమాలకు దూరమయితే తను కావాలనుకున్నప్పుడు అవకాశాలు వస్తాయా..? అనే విషయం అవికా ఆలోచించుకుందో లేదో..?