'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో వెండితెరకు పరిచయమయిన నటి రాశి ఖన్నా. ఆ తరువాత 'జిల్', 'బెంగాల్ టైగర్' చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ భామ 'ఆక్సిజన్', 'సుప్రీం' చిత్రాల్లో నటిస్తోంది. ఢిల్లీకు చెందిన ఈ బ్యూటీకి స్టార్ హోటల్స్ లో ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందట. తనకు లైఫ్ ఇచ్చిన హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోదామనే ఆలోచనలో రాశి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తన మకాంను హైదరాబాద్ కు షిఫ్ట్ చేసే పనిలో ఉందట. హైదరాబాద్ లో ఒక ఇల్లు తీసుకునే ఆలోచనలో ఉన్నానని ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన రాశి ఈ మధ్యనే ఒక ఇల్లును కొనుక్కుంది. షూటింగ్ లో పడి తన ఫ్యామిలీను మిస్ అవుతుండడంతో తన కుటుంబాన్ని కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసేస్తుందట.