ప్రస్తుతం టాలీవుడ్‌లో ఐటంసాంగ్ సీజన్ మొదలైంది. 'టెంపర్, బాహుబలి' చిత్రాల్లో నర్తించిన నోరాఫతేహి తాజాగా 'ఊపిరి' చిత్రంలో తన అందచందాలతో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక పవన్‌కళ్యాణ్ నటించిన 'గబ్బర్‌సింగ్' చిత్రంలో మలైకా అరోరా 'కెవ్వు కేక..' అంటూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. కాగా ఏప్రిల్ 8న విడుదలకు సిద్దమవుతున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్'లో రాయ్‌లక్ష్మీ ఐటం హైలైట్ కానుందని సమాచారం. మరోపక్క అల్లుఅర్జున్ -బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో గీతాఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న 'సరైనోడు' చిత్రంలో బన్నీ అంజలితో కలిసి నర్తించిన సాంగ్ ఇప్పుడు అన్ని చోట్లా అదరగొడుతోంది. మరో మెగాహీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా 'పటాస్' ఫేమ్ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న 'సుప్రీమ్' చిత్రంలో సాయి... ఇషాచావ్లాతో కలసి చిందులువేయనున్నాడు. మొత్తానికి ఈ మండుటెండల్లో అసలే హీట్ అయిపోతున్న ప్రేక్షకులు తమ అభిమాన హీరోల చిత్రాలోని ఐటంసాంగ్స్‌ను చూసి మరింతగా హీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.