Advertisement
Google Ads BL

'ఆక్సిజన్‌'లో ఆర్మీ ఆఫీసర్‌!


'లౌక్యం' చిత్రంతో హిట్‌ కొట్టిన హీరో గోపీచంద్‌ ఆ తర్వాత చేసిన 'జిల్‌' చిత్రంతో కేవలం ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన 'సౌఖ్యం' అయితే డిజాస్టర్‌గా నిలిచింది. కాగా ఆయన ప్రస్తుతం ప్రముఖ నిర్మాత ఎ.యం.రత్నం తనయుడు, డైరెక్టర్‌ జ్యోతికృష్ణ దర్శకత్వంలో 'ఆక్సిజన్‌' చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన రాశిఖన్నా, మలయాళ బ్యూటీ అను ఇమానియేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. వాస్తవానికి గోపీచంద్‌ అప్పుడెప్పుడో బి.గోపాల్‌ డైరెక్షన్‌లో నయనతార హీరోయిన్‌గా నటించే చిత్రంతో తమిళ ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. ఇప్పటికే ఎందరో డైరెక్టర్లు మారిన ఈ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. కాగా 'ఆక్సిజన్‌' చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో గోపీచంద్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. 'భారతీయుడు, జెంటిల్‌మేన్‌' తరహాలో ఈ చిత్రం సామాజిక అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. మరి ఈ చిత్రమైనా గోపీకి మరలా 'ఆక్సిజన్‌'లా హిట్‌ను అందిస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs