'దిల్‌వాలే' ఇచ్చిన షాక్ నుండి ఇంకా షారుఖ్‌ఖాన్ తేరుకోలేదు. అదే రోజున విడుదలైన 'బాజీరావ్ మస్తానీ' చిత్రం షార్‌ఖ్‌కు చుక్కలు చూపింది. అయితే ఈసారి ఏప్రిల్15వ తేదీన 'ఫ్యాన్స్' చిత్రం ద్వారా సోలోగా షారుఖ్‌ఖాన్ రానున్నాడు. కానీ ఆయన ఆ తదుపరి చిత్రానికి మాత్రం మరలా గట్టిపోటీ ఎదుర్కొనే పరిస్థితిని తెచ్చుకున్నాడు. తాజాగా షార్‌ఖ్ నటించిన 'రాయిస్' చిత్రం రంజాన్ కానుకగా విడుదలకానుంది. కాగా అదే రోజున సల్మాన్‌ఖాన్ తన తాజాచిత్రం 'సుల్తాన్'తో రానున్నాడు. దీంతో షారుఖ్ ఒక్కసారిగా మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే ఈ చిత్ర నిర్మాతలతోపాటు సల్మాన్, షార్‌ఖ్ కూడా ఒకేరోజున పోటీపడటానికి సిద్దంగా లేరు. దీంతో ఈ రెండు చిత్రాల నిర్మాతలు పరస్పరం చర్చించుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ...సల్మాన్, తాను మంచి స్నేహితులమని, తమ చిత్రాలు ఒకేరోజు పోటీపడకుండా చర్యలు తీసుకుంటానని, అవసరమైతే తానే వెనక్కి తగ్గుతానని చెప్పాడు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు, వారి అభిమానులు, బయ్యర్లు, ఎగ్జిబిటర్స్‌తో పాటు నిర్మాతలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రెండు చిత్రాల మద్య కనీసం ఒకటి రెండు వారాల గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా అంటోంది.