తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయినా కూడా ఈ మద్య తమిళం లోనే హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది హన్సిక. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ బాగా బొద్దుగా తయారైంది. తమిళ జనాలు హీరోయిన్స్ బొద్దుగా ఉంటేనే బాగా ఇష్టపడతారు, కాబట్టి పెద్దగా కేర్ తీసుకోలేదు హన్సిక ! అయితే ఉన్నట్టుండి ఈ మద్య ఎందుకనో వరుసగా అవకాశాలు ఒక్కొక్కటి దూరం అవుతున్నాయి. ప్రస్తుతానికి చేతిలో ఒక్క అవకాశం కూడా లేదు ! దానికి కారణం తాను బొద్దుగా ఉండడమే అనే నిజం తెలుసుకున్నట్టుంది, మరో వైపు తనకన్నా సీనియర్ హీరోయిన్స్ అయిన నయనతార లాంటి వాళ్ళు స్లిమ్ గా, గ్లామర్ గా మారి అవకాశాలు పట్టేస్తుంటే ... తానూ ఇలా వుంటే ఎలా అని కాస్త సీరియస్ గా ట్రై చేసి మెరుపుతీగ లా మారింది హన్సిక ! ఇప్పుడు మారిన హన్సిక ను చూస్తే అందరూ షాక్ అవుతారు. మరి సన్నగా మెరుపుతీగలా మారిన ఈ భామ తన నడుము వయ్యారాలను ఆరబోస్తూ ఫోటోకి ఫోజిచ్చింది. ఇంత గ్లామర్ గా మారిన హన్సిక కు ఈ దెబ్బతో అవకాశాలు క్యూ కట్టడం ఖాయం !!