గత కొన్ని రోజులుగా 'సర్దార్' సినిమా అనుకున్న సమయానికి రాదేమో అనే అనుమానాలు చాలా మందిలో కలిగాయి. ఇంకా రెండు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్నప్పటికీ ఏప్రిల్ 8న సినిమా ఎలా రిలీజ్ చేస్తారో.. అని పవన్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. వాటికి తెరపడేలా 'సర్దార్' సినిమా ఈరోజు సెన్సార్ కు వెళ్లి అందరిని ఆశ్చర్య పరిచింది. రెండు పాటలు లేకుండానే సర్దార్ సెన్సార్ పూర్తి చేసుకొంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు 'యు/ఏ' సర్టిఫికేట్ ను ఇచ్చారు. సినిమాలో ఫైట్స్ ఉండడం వలన యు/ఏ వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా చెప్పలేదట. మిగిలిన రెండు పాటల ఎడిటింగ్ పూర్తయ్యాక ఏప్రిల్ 2న మరోసారి సెన్సార్ చేయనున్నట్లు తెలుస్తోంది!