తాను చనిపోయికూడా తన ఫ్రెండ్స్ ను ఆత్మై చేరుకొని, వారి ప్రేమను పొందాలని ఒక ఆత్మ తన స్నేహితులతో గడిపే ఆనంద భయంకరమైన క్షణాలను సినిమాగా చిత్రీకరించారు దర్శకుడు స్వామిచంద్ర. జై హనుమాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాంబాబు పట్నాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్ గా ఈ సినిమా ఆడియోను ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించారు. ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ''స్నేహబంధాన్ని, ప్రాణ బంధంగా నమ్మే స్నేహితుల కథే ఈ సినిమా. దూరం అయిన తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడి, పాడాలని, శాశ్వతంగా గడపాలని ఒక ఆత్మ పడే ఆరాటమే ఈ కమిట్ మెంట్'' అని తెలిపారు.