Advertisement
Google Ads BL

రెజీనా భయపెట్టడానికి రెడీ అవుతోంది!


ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో ఈ తరహా చిత్రాలను రూపొందిస్తూనే.. ఇతర భాషల్లో రూపొందిన హారర్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసి హిట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇదే నేపధ్యంలో కోలీవుడ్ లో 'నెంజం మరప్పతిల్లై' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా.. ఎస్.జె.సూర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాగా రెజీనా ఈ సినిమాలో దయ్యంగా కనిపించబోతుంది. రెజీనా మొదటిసారిగా హారర్ సినిమాలో నటిస్తోంది. ఏ పాత్రలో అయినా.. ఒదిగిపోయే రెజీనా దయ్యంగా కూడా ప్రేక్షకులను భయపెట్టగలననే నమ్మకంతో ఉందట. ఇప్పటికే హన్సిక, తాప్సీ వంటి హీరోయిన్స్ దయ్యం పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. మరి రెజీనా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.. చూడాలి. ఈ సినిమాలో రెజీనాతో పాటు నందిత శ్వేతా అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs