'జాదూగాడు' చిత్రంలో నాగశౌర్యకు లిప్‌లాక్ కూడా ఇచ్చి గ్లామర్‌షోకు రెడీ అన్న హీరోయిన్ సోనారిక. ఇక 'కుమారి 21 ఎఫ్'తో బోల్డ్ సీన్స్‌లో తన నటన, గ్లామర్‌షో, కాస్త మోతాదు మించిన డైలాగుల్లో కూడా నటించి యువతను ఆకట్టుకున్న మరో హీరోయిన్ హెబ్బాపటేల్. కాగా వీరిద్దరు ఇప్పుడు ఒకే సినిమాలో నటిస్తూ అందరి మతులు పోగొట్టేందుకు రెడీ అవుతున్నారు. అదే 'ఈడో రకం.. ఆడో రకం'. ఇందులో మంచు విష్ణు సరసన సోనారిక నటిస్తుండగా, రాజ్‌తరుణ్‌కు జోడీగా హెబ్బాపటేల్ నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రం చూసిన వారికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు మతులు పోగొడున్నారు. ఈ చిత్రంలో హీరోలైన మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌లను ఈ ఇద్దరు డామినేట్ చేస్తూ, తమ గ్లామర్‌షోతోనే ఈ చిత్రానికి మంచి క్రేజ్ తెచ్చిపెడుతున్నారు. మరి సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రానికి ఓపెనింగ్స్ విషయంలో ఈ ఇద్దరి గ్లామర్‌షో బాగా ప్లస్ కానుందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి.