Advertisement
Google Ads BL

బిగ్‌ఫైట్‌ జరుగనుందా..?


కోలీవుడ్‌లో నూతన తమిళ సంవత్సరాది అయిన ఏప్రిల్‌ 14న రెండు భారీ చిత్రాలు పోటీపడనున్నాయా? అంటే అవుననే అంటున్నారు. తమిళస్టార్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న 'తేరీ' చిత్రం అదే రోజున విడుదలకానుంది. ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఉంది. డేట్‌ను కూడా లాక్‌ చేశారు. ఇక మరో తమిళస్టార్‌ సూర్య-విక్రమ్‌ కె.కుమార్‌ల '24' చిత్రం కూడా అదే రోజున విడుదలవుతుందని ఇంతకు ముందే నిర్మాతలు ప్రకటించారు. 'తేరీ' విడుదల కేవలం తమిళంలోనే జరగనుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్‌ చేయాలా? లేక సినిమా మంచి హిట్టయితే రీమేక్‌ చేయాలా అనే సందిగ్దంలో నిర్మాతలు ఉన్నారు. కానీ సూర్య '24' చిత్రం పరిస్దితి అదికాదు. ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రాన్ని కనుక ఏప్రిల్‌ 14న విడుదల చేస్తే అటు 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' కు వారం తర్వాత, బన్నీ 'సరైనోడు'కు వారం వెనుక ఈ చిత్రం రావాల్సివస్తుంది. ఈ పోటీవల్ల తమ చిత్రానికి తెలుగులో ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ విషయంలో సందిగ్దం నెలకొని ఉంది. ఇక సూర్య విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం 'సింగం3' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 'సింగం' సిరీస్‌తో తనకు వరుస విజయాలు ఉందించిన హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అనుష్క ఓ కీరోల్‌ను చేయనుండగా, మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తోంది. కాగా ఈచిత్రం ట్రైలర్‌ను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs