టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరు హీరోయిన్ లు ఇప్పుడు తమ సినిమాలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. 'కృష్ణం వందే జగద్గురుం' సినిమా తో నయనతార మొదలుపెట్టింది. ఆ తరువాత సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా వంటి వారు తమ డబ్బింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు. కాజల్, తమన్నాలు డబ్బింగ్ చెప్పిన సినిమాలు రిలీజ్ కు దగ్గరవుతున్నాయి. అయితే ఇప్పుడు టాప్ హీరోయిన్ లలో అనుష్క మరియు శ్రుతి హాసన్ లు మాత్రమే మిగిలి ఉన్నారు. 11 సంవత్సరములుగా తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న అనుష్క తెలుగు చక్కగా మాట్లాడగలదు. అయితే ఇప్పటివరకు డబ్బింగ్ చెప్పే అవకాశం రాలేదు. శ్రుతి హసన్ సింగర్ గా కొన్ని తెలుగు పాటలు పాడినప్పటికీ డబ్బింగ్ జోలికి మాత్రం వెళ్ళట్లేదు.