నాగార్జున, కార్తీ, తమన్నాలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఊపిరి' ఈ నెల 25న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పివిపి సంస్ధ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. ఈ చిత్రం ఓ ఫ్రెంచ్ చిత్రమైన 'ది ఇన్‌టచ్‌బుల్స్' సినిమా కథతో సాగుతుందని అందరికీ తెలిసిన విషయమే. కాగా ఇటీవల విడుదలైన 'ఊపరి' ట్రైలర్‌ను చూసి, ఆల్‌రెడీ 'ది ఇన్‌టచ్‌బుల్స్' ని కూడా చూసిన వారు మాత్రం ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో మక్కీకి మక్కీ దింపారని అంటున్నారు. ఇక విషయానికి వస్తే ఇటీవల ఈ చిత్రం ప్రెస్‌మీట్ జరిగింది. ఈ సినిమా విషయంలో నాగార్జున, కార్తీలు పొందిక లేకుండా వేర్వేరుగా మాట్లాడటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ మీడియా సమావేశంలో నాగ్ మాట్లాడుతూ... ఇది ఓ ఫ్రెంచ్ మూవీకి రీమేక్ అని ప్రకటించాడు. కానీ ఆ వెంటనే కార్తి మాట్లాడుతూ... దీన్ని రీమేక్ అనకండి. అలా పిలవవద్దు అంటూ మాట్లాడాడు. వాస్తవానికి ఈ విషయంలో నాగ్ చెప్పిన మాటలే వాస్తవం అని అందరికీ అర్ధం అవుతోంది. కానీ ఈ చిత్రం రీమేక్ రైట్స్‌ను కొన్నారా? లేక అనఫిషియల్‌గా కాపీ కొట్టారా? ఇది ఫ్రీమేకా? అన్న విషయంపై చర్చ నడుస్తోంది.