Advertisement
Google Ads BL

నష్టపోయిన నిర్మాతలు-లాభపడిన సూపర్‌స్టార్‌!


మోహన్‌లాల్‌.. మలయాళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా ఉన్న క్రేజీ నటుడు. కాగా ఆయన అప్పుడెప్పుడో బాలకృష్ణ హీరోగా వచ్చిన 'గాండీవం' సినిమాలో ఓ పాటలో బాలకృష్ణ, అక్కినేనినాగేశ్వరరావులతో కలిసి చిందులేశాడు. ఆ తర్వాత మణిరత్నం 'ఇద్దరు', 'కాలాపానీ' వంటి చిత్రాలతో పాటు ఈ మధ్య విడుదలైన 'జిల్లా' డబ్బింగ్‌ వెర్షన్‌లో కూడా నటించి టాలీవుడ్‌ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న కొరటాల శివ 'జనతాగ్యారేజ్‌' చిత్రంలో ఆయన కీలకపాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో రూపొందనున్న 'మనమంతా' అనే చిత్రంలో కూడా నటించనున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'జనతాగ్యారేజ్‌'లో ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్‌ గురించి ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో కీలకపాత్రను చేస్తున్నందుకుగాను మోహన్‌లాల్‌కు 1కోటి 50లక్షల రెమ్యూనరేషన్‌తో పాటు ఈచిత్రం మలయాళ వెర్షన్‌ హక్కులను కూడా ఆయనకే ఇస్తామని చిత్ర నిర్మాతలైన 'మైత్రి మూవీస్‌' అధినేతలు మోహన్‌లాల్‌తో ఒప్పందం చేసుకున్నారట. ఈ చిత్రం మలయాళ వెర్షన్‌ హక్కులు మోహన్‌లాల్‌ను చూసి కోటి రూపాయలు మాత్రమే పలికే అవకాశం ఉందని మొదట అగ్రిమెంట్‌ చేసుకునే ముందు ఈ చిత్ర నిర్మాతలు భావించారని సమాచారం. కానీ చిత్రంగా ఈ సినిమా మలయాళ వెర్షన్‌ హక్కులు ఏకంగా నాలుగుకోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో చిత్ర నిర్మాతలకు 3కోట్లు నష్టం వచ్చిందని, సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ జాక్‌పాట్‌గా ఏకంగా 3కోట్లు అధికంగా వచ్చినందుకు ఆనందంగా ఉన్నాడని సమాచాచం. అంటే ఈచిత్రంలో నటించినందుకు గాను మోహన్‌లాల్‌కు ఏకంగా 5కోట్ల 50లక్షలు ముట్టాయి. వాస్తవానికి మలయాళ పరిశ్రమతో పోల్చుకుంటే ఈ చిత్రంలో కేవలం కీరోల్‌ చేస్తున్న మోహన్‌లాల్‌కు ఈ మొత్తం చాలా పెద్దదని అర్ధం అవుతోంది. 

Advertisement
CJ Advs

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs