Advertisement

రెండు చిత్రాలకు మాత్రమే ఢోకాలేదు..!


సమ్మర్‌ సీజన్‌ ప్రారంభమైంది. ఇప్పటికే ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు పూర్తయ్యాయి.మరో పదిరోజుల్లో పదోతరగతి పరీక్షలు కూడా ముగుస్తాయి. ఇక ఈ వేసవి కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న చిత్రాల డేట్లు కూడా అయోమయంలో ఉన్నాయి. ఇప్పటివరకు 'ఊపిరి, సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రాలు తమ రిలీజింగ్‌ డేట్స్‌ను ప్రకటించుకున్నాయి. మార్చి 25న నాగ్‌, కార్తీల కాంబినేషన్‌లో రానున్న 'ఊపిరి'తో సమ్మర్‌ సందడి ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 8వతేదీన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రెండు చిత్రాల విడుదల మధ్య రెండు వారాల గ్యాప్‌ ఉండటంతో ఇబ్బంది పెద్దగా లేదు. కానీ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' సూపర్‌హిట్‌ టాక్‌ను తెచ్చుకుంటే మాత్రం ఇక ఆపై విడుదలకు ప్లాన్‌ చేసుకుంటున్న చిత్రాల డేట్స్‌ అటు ఇటు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే మాత్రం ఇతర చిత్రాలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఏప్రిల్‌1న విడుదల చేయాలని భావిస్తున్న సాయిధరమ్‌తేజ్‌-దిల్‌రాజు-అనిల్‌రావిపూడిల 'సుప్రీం' విషయంలో నిర్మాత ఓ అడుగు వెనక్కి వేసినట్టే కనిపిస్తోంది. 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' ఫలితం మీద సూర్య-విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో రానున్న '24' చిత్రం ఏప్రిల్‌ 14న వస్తుందా? లేదా? అనే సందగ్డం నడుస్తోంది. ఇక 'సరైనోడు' విషయంలో కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించడానికి వెనకడుగు వేస్తున్నారు. 'సర్దార్‌' సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే 'బాహుబలి'లాగా ఒక మూడు నాలుగు వారాలు ఆ చిత్రం హవానే నడుస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో 'సరైనోడు'ఏప్రిల్‌ 22న వస్తాడా? లేదా? అనే విషయంపై భిన్న ప్రచారం జరుగుతోంది. ఇక మే తొలివారంలో త్రివిక్రమ్‌శ్రీనివాస్‌-నితిన్‌ల 'అ...ఆ' రిలీజ్‌ కానుంది. మే చివరి వారంలో మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం'ను రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో రజనీకాంత్‌ నటించిన 'కబాలి' చిత్రానికి మే 27న రిలీజ్‌ డేట్‌ లాక్‌ చేశారు. ఇలా అన్ని సినిమాల విడుదలలో అయోమయం కొనసాగుతోంది. మొత్తానికి 'సర్దార్‌' 'బాహుబలి' టైప్‌లో అందరినీ ఆకట్టుకుంటే మాత్రం మిగిలిన చిత్రాలు ఎప్పుడు రిలీజ్‌ అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement