Advertisement
Google Ads BL

శంకర్‌ను పట్టించుకోని మెగాస్టార్‌..!


ఒక్కసారైనా తన చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ చేత ఓ పాత్ర చేయించాలనేది దక్షిణాది దిగ్దర్శకుడు శంకర్‌ కోరిక. అందుకోసం ఆయన 'శివాజీ' చిత్రం నుండి అమితాబ్‌ను తన చిత్రంలో నటించమని అడుగుతూనే ఉన్నాడు. ఆయన ఒప్పుకోకపోవడంతో రఘువరన్‌ చేత ఆ పాత్రను చేయించాడు శంకర్‌. ఆ తర్వాత 'రోబో' చిత్రంలో కూడా విలన్‌ పాత్రను చేయమని శంకర్‌ బిగ్‌బిని కోరినా ఆయన తిరస్కరించాడు. తాజాగా రజనీ, అక్షయ్‌కుమార్‌లతో శంకర్‌ తీస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రోబో2.0' చిత్రంలో కూడా అమితాబ్‌ మాత్రమే చేయగల ఓ కీలకపాత్ర ఉందని, దానిలో నటించమని శంకర్‌ ప్రత్యేకంగా అమితాబ్‌ను కలుసుకొని ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఈచిత్రంలో అమితాబ్‌ నటిస్తే ఎంత రెమ్యూనరేషన్‌ ఇవ్వడానికైనా సిద్దమని శంకర్‌ చెప్పినప్పటికీ అమితాబ్‌ నుంచి పాజిటివ్‌ స్పందన రాలేదని సమాచారం. అలాగని ఆ పాత్ర చేయనని కూడా అమితాబ్‌ చెప్పలేదట. దాంతో తన కోరిక నెరవేరుతుందా? బిగ్‌బి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తాడా? అనే టెన్షన్‌లో శంకర్‌ ఉన్నాడని కోలీవుడ్‌, బాలీవుడ్‌ సమాచారం. అమితాబ్‌ కానీ ఒప్పుకుంటే ఇక ఈ చిత్రం రేంజ్‌ మరింతగా పెరగడంతోపాటు తన చిరకాల కోరిక కూడా నెరవేరుతుందని శంకర్‌ భావిస్తున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs