సింహాద్రి, యమదొంగ; ఈ రెండు చిత్రాలు జూనియర్ ఎన్టీయార్ కెరీర్ మొత్తంలో కలికితురాళ్ళుగా ఎందుకు మిగిలాయి అంటే రాజమౌళి, తారక్ మధ్య ఉన్న రసాయన శాస్త్రం అటువంటిది మరి. అప్పటి నుండీ మళ్ళీ వీరిద్దరి కలయికలో ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్న ఇరువురు అభిమానులకు ఓ శుభవార్త వచ్చేట్టుగానే ఉంది. బాహుబలి 2 తరువాత గరుడ పేరుతో వెయ్యి కోట్ల ప్రాజెక్టును జక్కన్న సిద్ధం చేస్తున్నాడు అని టాక్ వినబడినా తాను ఇంకా ఆ స్థాయి సినిమాని డీల్ చేసే ఎత్తుకు ఎదగలేదని చెప్పుకుంటున్న దర్శకదీరుడు ప్లాన్ Bని అమలు చేసే పనిలో పడ్డాడట. ఈసారి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో జూనియర్ ఎన్టీయార్, సూర్యలతో ఓ భారీ బడ్జెట్ మాస్, యాక్షన్ చిత్రం కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టే పనిలో భాగంగా తన రెగ్యులర్ రైటింగ్ టీంకి బాధ్యతలు అప్పజెప్పాడని టాక్. బాహుబలి 2 అయిపోయే సరికి ఈ స్క్రిప్ట్ బౌండ్ సిద్ధంగా ఉండవచ్చని, వెంటనే ఇద్దరి హీరోల కాల్షీట్స్ అనుగుణంగా భారీ లెవెల్లో ప్రాజెక్ట్ లాంచింగ్ ఉంటుందని ఓ వార్త పరిశ్రమలో బయల్దేరింది. రాజమౌళితో ఒక్క సినిమాకైనా పని చేయలాన్న సూర్య ఆశ, రాజమౌళితో మళ్ళీ మళ్ళీ శ్రమించాలన్న తారక్ కోరిక ఒకేసారి తీరేట్టున్నాయి.