ఆ మధ్య అఖిల్ సినిమా ఇచ్చిన షాకుతో దర్శకుడు వీవీ వినాయక్ ఇల్లు అమ్మేసుకుని మరీ నిర్మాత వల్ల నష్టపోయిన కొంతమంది బయ్యర్లకు సొమ్ములు వెనక్కి ఇచ్చి మంచి పేరు సంపాదించాడు. వినాయక్ స్వతహాగా మంచి మనిషి అని చెప్పడానికి ఇదో తార్కాణం. అయినా ఫైనాన్శియలుగా వెల్ లేయిడ్ ఆఫ్ ఫ్యామిలీ నుండి వచ్చిన వినాయక్ ఇల్లు అమ్ముకొని డబ్బులు పంచాల్సిన దుస్థితిలో లేడు అన్నది ఇండస్ట్రీలో ఓ వాదన. ఏదైతే ఏమిటి, వినాయక్ ఇల్లు అమ్మాడు బట్ ఆ మహల్ లాంటి ఇల్లు కొన్నది ఎవరో తెలుసా కుర్ర హీరో సందీప్ కిషన్. ఇంతకీ ఎంతకి కొన్నాడు అన్నది మనకి కూడా పూర్తిగా తెలీదు గానీ, తాను ఇండస్ట్రీలో హీరోగా ఉంటూ ఏడేళ్ళు కష్టపడి సంపాదించిన మొత్తం పోసి ఆ హౌస్ కొన్నానని సందీప్ మీడియా వారి చెవిన వేసేసాడు. విహార యాత్రలకు, దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నానని గర్వంగా ఫీలవుతున్నాడు సందీప్. ఇంకా బ్యాచిలర్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సందీపుకి ఇంత పెద్ద కుటీరం ఎందుకంటారా? మీరనేది పెళ్లేగా, చేసుకుంటాడు లెండి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలులో ముందు మొదటిది ఓకే అయింది... ఇక రెండు, మూడు తరువాయి!