రిలీజ్ డేట్ కళ్ళ ముందు కదలాడుతుంటే, ఎదురుగా చూస్తే కొండంత షూటింగ్ ఇంకా మిగిలే ఉంటే... ఒక వైపు నిర్మాత గుండెల్లో రైళ్ళు పరిగెడుతుంటే, మరో వైపు దర్శకుడు తత్తరపాటుకు గురవుతుంటే... అబ్బో, ఆ బాధని అక్షరాల్లో పెట్టలేములెండి. సరిగ్గా సినిమా మీద పని చేసిన ఎవరికైనా ఆ ఆఖరి నిమిషం పెయిన్ ఏంటో తెలుస్తుంది. అవునులే నో పెయిన్, నో గెయిన్ అని ఊరికే అనలేదుగా. పవన్ కళ్యాణ్, శరత్ మరార్, బాబీల పరిస్థితి ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో అచ్చు పైన చెప్పినట్టుగానే ఉంది. ఒకటో, రెండో కాదు, ఏకంగా మూడు యూనిట్లు రాత్రింబవళ్ళు అలుపు లేకుండా షూటింగ్ చేస్తున్నాయి. అన్నింటిలోను పవన్ కళ్యాణ్ ఉండాల్సిన సీన్లే ఉన్నాయి కాబట్టి మన హీరో డబల్ యాక్షన్ కాదు ట్రిపల్ యాక్షన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. పాపం చిత్రంలో ఓ హీరోయిన్ అయిన సంజనా అయితే ఒకే లొకేషన్లో పవన్ సార్ మూడు రకాల యాక్టింగ్ చేస్తుంటే, చూసి తరింఛిపోయాను అంటోంది. ఏప్రిల్ 8కి ఎలాగోలా వచ్చేయాలని అన్న కసి ఇప్పుడు అందరిలోనూ ఉంది, ఇదే కసి గనక ఓ రెండు నెలల ముందు చూపితే ఇంత గోల తప్పేది కదా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నైట్ అవుట్లు చేసి సిలబస్ మొత్తం పరీక్షకి ఒక్క రోజు ముందు కంప్లీట్ చేసి పాసయి పోయినట్టు ఉంది సర్దార్ పోలిక. మరి సర్దార్ డిస్టింక్షన్లో పాసవుతాడా లేక అత్తెసరు మార్కులతోనా అన్నది వెయిట్ అండ్ సి.